September 5, 2026
Explore
సెప్టెంబరు 8న మిక్సిడ్ రైస్ ఈ-వేలం

సెప్టెంబరు 8న మిక్సిడ్ రైస్ ఈ-వేలం

September 5, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండీ ద్వారా సమర్పించిన బియ్యాన్ని సెప్టెంబరు 8న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.

ఈ సందర్భంగా మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల మిక్సిడ్ రైస్‌ను ఈ-వేలంలో ఉంచనున్నారు.
ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారు సెప్టెంబరు 5వ తేదీ సాయంత్రంలోపు ఆన్‌లైన్‌లో కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది.

ఈ-వేలానికి సంబంధించిన ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429.
అలాగే www.konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను తెలుసుకోవచ్చు.

Tags: Mixed rice e-auction on September 8