పుంగనూరుముచ్చట్లు:
భార్య తనకు ఆటో కొని ఇవ్వలేదని గొడవ పడి మనస్థాపంతో ఆటోడ్రైవర్‌గా ఉన్న భర్త ఉరివేసుకుని ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. రామసముద్రంకు చెందిన ఆటోడ్రైవర్ చాంద్‌బాషా(30) బాడుగ ఆటోను తీసుకుని పట్టణంలోని ఎన్‌ఎస్.పేటలో నివాసం ఉన్నాడు. అతడు ప్రతి రోజు బాడుగ ఆటోను నడుపుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఇలా ఉండగా భార్యను కొత్త ఆటోను కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై ఆమె తన వద్ద అంత డబ్బులు లేవని, అప్పులు చేసి ఆటో కొనడం మంచిది కాదని సూచించింది. దీనిపై చాంద్‌బాషా భార్యతో ఘర్షణపడి ఇంటిలోనికి వెళ్లి తలుపుకు గడియపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనను గమనించిన భార్య, కుటుంబ సభ్యులు చాంద్‌బాషాను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మృతి చెందడంతో ఆకుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇద్దరు పిల్లల ఆర్తనాదాలు పలువురిని కలచివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రమణ కేసు నమోదు చేసి , శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు.
Tags: Husband commits suicide after not being given auto loan