పుంగనూరుముచ్చట్లు:
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం శ్రీకృష్ణ ఆలయాలలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కృష్ణంరెడ్డిపల్లె రోడ్డులో గల శ్రీకృష్ణ ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించి పూజలు చేశారు. వేకువజాము నుంచి ఆలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించి , పూజలు చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు, చిన్నారులు, పెద్దలు కలసి శ్రీకృష్ణ వేషధారణలు ధరించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సాంస్కతిక కార్యక్రమాలు, కోలాటలు, పిల్లనగ్రోవి పాటల నడుమ మేళతాళతో స్వామివారిని పట్టణ పురవీధులలో ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది పట్టణ ప్రజలు హాజరై , పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కాకుండ సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు.





Tags: Krishnashtami celebrations held with devotion and reverence.