September 1, 2026
Explore
భర్త బలవంతపు మతమార్పిడి.

భర్త బలవంతపు మతమార్పిడి.

September 1, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

. కాకినాడ ఎస్పీ ఆఫీస్ వద్దే తిరిగి హిందూ మతంలోకి వచ్చిన భార్య

భర్త తనను బలవంతంగా మతం మార్చి వేధించాడని మహిళ ఆరోపణ

ప్రేమ వివాహం తర్వాత వేధింపులు తీవ్రమయ్యాయని భార్య ఆవేదన

మరో ఐదారుగురు మహిళలనూ మతం మార్చాడని ఫిర్యాదు

భర్త గౌస్ మొహిద్దీన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

కాకినాడ జగన్నాథపురానికి చెందిన సిరివూరి బాలరమ్య, డిగ్రీ చదువుతున్న రోజుల్లో మటన్ షాపు నడిపే గౌస్ మొహిద్దీన్‌తో ప్రేమలో పడింది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి ఆమె అతడిని వివాహం చేసుకుంది. అయితే, వివాహమైన రెండు నెలలకే వేధింపులు ప్రారంభమయ్యాయని, తనను బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేసి షేక్ ఉమల్ ఖైర్‌గా పేరు మార్చాడని ఆమె వాపోయింది.

తమకు కుమార్తె జన్మించిన తర్వాత వేధింపులు మితిమీరాయని, తన సమక్షంలోనే మరో ఐదారుగురు హిందూ యువతులతో సహజీవనం చేస్తూ, వారిని కూడా మతం మార్చాడని ఆమె ఆరోపించారు. దీనిపై నిలదీస్తే.. తనకు ఏడుగురిని వివాహం చేసుకునే అధికారం ఉందని చెబుతూ, కత్తులతో బెదిరించి దాడి చేసేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన సోదరిని కూడా వేధిస్తానని అతడు బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు.

గతంలో ఓ యువతిని కత్తితో గాయపరిచిన కేసులో గౌస్ మొహిద్దీన్‌పై రౌడీషీట్ నమోదైందని, ప్రస్తుతం ఒక ఎస్సీ మహిళను వేధించిన కేసులో అతడు రిమాండ్‌లో ఉన్నాడని బాలరమ్య తెలిపారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌తో కలిసి జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను కలిసిన ఆమె, తనకు రక్షణ కల్పించి భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి బలవంతపు మతమార్పిడులపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రామ్‌కుమార్ డిమాండ్ చేశారు.

Tags: Forced religious conversion by the husband.