ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంజాయి సేవిస్తున్న వారి సమాచారం ఇస్తే రూ. 1,500 బహుమతిని అందిస్తారు. డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణా వివరాలు అందిస్తే రూ. 5,000 రివార్డు ఉంటుంది అని సీపీ రాజశేఖర్ బాబు ప్రకటించారు. ఈ ప్రయత్నంలో ఈగల్ బృందం కూడా పోలీసులతో కలిసి పని చేస్తుంది
ఇప్పటికే 1,287 మందిని గుర్తించిన పోలీసులు, యువతను రక్షించే లక్ష్యంతో మత్తు రహిత సమాజం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
యువతను లక్ష్యంగా చేసుకుని దళారులు, వ్యాపారస్తులు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారని గుర్తించిన నేపథ్యంలో, ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెంచనున్నారు. మత్తు పదార్థాల విక్రేతలకు జైలు తప్పదని పోలీసులు హెచ్చరిస్తూ, యువత మంచి బాట పట్టాలని హితవు పలికారు. మత్తు రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:Rs 1,500 reward for reporting cannabis users in AP!