September 1, 2026
Explore
లంచం తీసుకుంటూ ఆర్‌ఐ, వీఆర్వో ఏసీబీకి చిక్కారు.

లంచం తీసుకుంటూ ఆర్‌ఐ, వీఆర్వో ఏసీబీకి చిక్కారు.

September 1, 2026 | Andhra Pradesh

అలేరు ముచ్చట్లు:

భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అధికారిక నివేదిక జారీ చేసేందుకు రూ.14 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అలేరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వేముగంటి పురుషోత్తమరావు, కొలనుపాక గ్రామ పాలనాధికారి షేక్‌ అహ్మద్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నల్గొండ రేంజ్‌ ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Tags: An RI and a VRO were caught by the ACB while accepting a bribe.