ఈ రాత్రి నీతో గడపాలని ఉంది రా..
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం నగర శివారులో శనివారం అర్ధరాత్రి సంచలనం సంచలనం రేపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని నలుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. బళ్లారి రోడ్డులోని ఆరాధ్య హోమ్స్ సమీపంలో జరిగిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. అనంతపురం గ్రామీణం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని తపోవనం ప్రాంతానికి చెందిన మఠం సోమశేఖర్ చిన్న కుమారుడు భరద్వాజ్ (33) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. కొద్దికాలం క్రితం అతనికి నగరంలోని ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంపై సదరు మహిళ భర్త శ్రీహరికి పలుమార్లు సమాచారం అందింది. భరద్వాజ్‌ను అతను ఇప్పటికే అనేకసార్లు తీవ్రంగా హెచ్చరించాడు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు.
గత మార్చి నెలలో భరద్వాజ్ సదరు మహిళను తీసుకుని వెళ్లిపోవడంతో, అప్పట్లో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకెళ్లి వచ్చినప్పటికీ భరద్వాజ్ తీరు మార్చుకోలేదు. భార్యతో సంబంధం కొనసాగిస్తుండడంతో రగిలిపోయిన భర్త శ్రీహరి ఎలాగైనా అతన్ని అంతం చేయాలని కక్ష పెంచుకున్నాడు. పక్కా వ్యూహంతో పథకం రచించాడు.
ఫోన్ కాల్‌తో రప్పించి.. కొడవళ్లతో నరికి..
శనివారం రాత్రి శ్రీహరి తన భార్య చేతనే భరద్వాజ్‌కు ఫోన్ చేయించాడు. బళ్లారి రోడ్డులోని ఆరాధ్య హోమ్స్ ప్రాంతంలోని ఓ నిర్జన ప్రదేశానికి రావాలని ఆమె ద్వారా పిలిపించాడు. కారులో అక్కడకు చేరుకున్న భరద్వాజ్‌ను అనుసరిస్తూనే శ్రీహరి, అతని బంధువులు అనిల్, కుమార్, రామాంజిలు ఒక్కసారిగా పథకం ప్రకారం దాడికి దిగారు. కొడవళ్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో భరద్వాజ్ కుడిచేయి తెగిపడింది. తీవ్రగాయాలపాలై రక్తపుమడుగులో విలవిల్లాడుతుండగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అర్బన్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న భరద్వాజ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల ఆచూకీ కోసం ఏడు ప్రత్యేక బృందాలతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
Tags: Wife who summoned her lover and had her husband murdered.