August 28, 2026
Explore
ఈ చిత్రాన్ని రాజకీయ నాయకులందరూ చూడాలి .

ఈ చిత్రాన్ని రాజకీయ నాయకులందరూ చూడాలి .

August 28, 2026 | Andhra Pradesh

నేపాల్ ముచ్చట్లు:

వరదలకు ముందు .. ఆ తరువాత ..

ఇల్లు చూడండి ఎక్కడ కట్టుకున్నారో ..

నిన్న నేపాల్లో జరిగిన వరద బీభత్సవం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది . కళ్ళ ముందే నిమిషాలలో మొత్తం మాయమైపోయింది .

మనకి నచ్చినా నచ్చకపోయినా .. రేవంత్ రెడ్డి హైడ్రా మంచి పనే చేస్తుందనిపిస్తుంది . మొహమాటం .. రాజకీయ ఒత్తిడులు లేకుండా అక్రమంగా కట్టిన మొత్తం బిల్డింగ్లు కొట్టేయాలి ..

అలానే చంద్రబాబు గారు కూడా పంతాలకు పోకుండా అమరావతి కట్టడాలు మరొకసారి పునరాలోచన చేయాలి . శ్రీకృష్ణ లాంటి నిపుణులు సూచనలు పరిగణనలోకి తీసుకొని బిల్డింగులని మైదాన ప్రాంతాలకి మార్చాలి ..

నాగార్జున యూనివర్సిటీ కి అటుఇటు ఉండేటట్లు ప్లాన్ చేస్తే కృష్ణా వరద ముంపుకి గురికాకుండా ఉంటుంది .

తుళ్ళూరులో అక్కడ కట్టడాలు ఏమీలేని సమయంలోనే మాములూ వరదలకే కొండవీటి వాగు పొంగితే ఆ ముప్పై గ్రామాలకి 10 రోజులు రాకపోకలు ఉండవు ..

అలాంటిది ఆ ప్రాంతమంతా కట్టడాలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాక వరదలు వస్తే ఆ నీళ్లన్నీ ఎటుపోవాలి ? నేపాల్ లాంటి వరదలు వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ?

పల్లపు ప్రాంతాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొని బిల్డింగ్లు కట్టినా ఏదో ఒకరోజు ముప్పు తప్పదు .

చంద్రబాబు గారికి చేతులెత్తి మొక్కుతాం .. రాజధాని అంటే ఐదేళ్ల వ్యవహారం కాదు . వేల సవంత్సరాలు ఉండాల్సిన నగరం .

నదులుని దారి మల్లించటం అసంభవం , ప్రపంచంలో అదెక్కడా జరగలేదు .. ప్రకృతికి మనిషి ఎదురు నిల్వలేడు .

నీరు పల్లమెరుగు నిజం దేముడెరుగు .. ఈ సత్యాన్ని ఏ శక్తీ మార్చలేదు .

దయచేసి పునరాలోచన చేయండి .

Tags: All politicians should watch this movie.