August 26, 2026
Explore
జల్సాల కోసం దొంగతనాలు.. ఘరానా దొంగ అరెస్ట్

జల్సాల కోసం దొంగతనాలు.. ఘరానా దొంగ అరెస్ట్

August 26, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సుండుపల్లి మండలం జీకే రాచపల్లెకు చెందిన షేక్ నౌమాన్ అలియాస్ మస్తాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 84.76 గ్రాముల బంగారు నగలు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు సుండుపల్లి సీఐ సురేశ్‌రెడ్డి తెలిపారు. నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

Tags: Thefts committed for a lavish lifestyle… Notorious thief arrested.