August 23, 2026
Explore
తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నడపబడుతున్న.

తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నడపబడుతున్న.

August 23, 2026 | Andhra Pradesh

..ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మ.

తిరుమల ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ నూతన చైర్మన్‌గా నియమితులైన శ్రీధరవర్మ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న ఆయన, అనంతరం అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీధరవర్మ మాట్లాడుతూ.. శ్రీవారి ఖ్యాతిని, సనాతన హిందూ ధర్మ విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ ఛానల్‌ను మరింత ముందుకు నడిపిస్తానని తెలిపారు. తనకు ఈ ఉన్నత బాధ్యతలను అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: Run by the Tirumala Tirupati Devasthanams.