August 21, 2026
Explore
జాలి, కరుణ లేని పాడు సమాజం.. అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన యువకుడు..

జాలి, కరుణ లేని పాడు సమాజం.. అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన యువకుడు..

August 21, 2026 | Andhra Pradesh

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు:

రాయిబరేలిలోని పోలీస్ స్టేషన్ లో నాలుగున్నర సంవత్సరాల క్రితం ఓ యువతి ఓ యువకుడిపై అత్యాచారం జరిగిందంటూ కేసు పెట్టింది.కేసు కోర్టుకు వెళ్లింది.యువకుడికి శిక్ష పడింది.దాంతో అతను 4 సంవత్సరాల 6 నెలలకుపైగా జైల్లోనే ఉన్నాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో ఆ యువతి కోర్టులో మరో పిటిషన్ వేసింది.’నాపై అత్యాచారం జరగలేదు..నేను అతనిపై తప్పుడు కేసు పెట్టాను..’అని.కోర్టు ఆ విషయాన్ని పరిశీలించి యువకుడిని విడుదల చేసింది.కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. తప్పుడు కేసు పెట్టి,తప్పుడు సాక్ష్యం చెప్పిన యువతికి ఆ యువకుడు ఎంతకాలం జైల్లో ఉన్నాడో అంతకాలం జైలు శిక్ష విధించింది. అంటే 1,653 రోజుల జైలు శిక్ష.అంతేకాదు ₹5,88,822 జరిమానా కూడా విధించింది. ఆ జరిమానా కట్టకపోతే మరో 6 నెలలు జైలు శిక్ష అని తీర్పు చెప్పింది. తప్పుడు కేసు పెట్టాలి అనుకున్నవాళ్ళు ఆలోచించాలి.

Tags: A heartless society devoid of pity and compassion… a young man who unjustly served a prison sentence…