పుంగనూరుముచ్చట్లు:
దోమకాటుకు గురికాకుండ, దోమల నివారణ కోసం ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యసిబ్బంధి అవగాహన ర్యాలీ నిర్వహించారు. గురువారం డాక్టర్ జయంత్‌సాయి ఆధ్వర్యంలో యూనిట్ అధికారి గంగయ్య , వైద్య సిబ్బంది కలసి తూర్పువెహోగసాలలో ర్యాలీ నిర్వహించారు. గంగయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని, దోమ తెరలు వాడాలని , ఇంటి వద్ద నీటి నిల్వలు లేకుండ చూడాలన్నారు. జ్వరానికి గురైన వెంటనే రక్తపరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో సహాయకులు సోమశేఖరాచారి, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Take measures to control mosquitoes.