August 20, 2026
Explore
మూర్ఛతో కిందపడిన వ్యక్తికి సీఐ సాయం

మూర్ఛతో కిందపడిన వ్యక్తికి సీఐ సాయం

August 20, 2026 | Andhra Pradesh

గద్వాలముచ్చట్లు:

ఫ్లైఓవర్‌పై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సీఐ టంగుటూరి శ్రీనివాసులు గమనించి స్థానికుల సహాయంతో అతడిని రోడ్డుపక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. బాధితుడు కోలుకునే వరకు అక్కడే ఉండి, అనంతరం జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. సీఐ మానవత్వాన్ని పట్టణ ప్రజలు అభినందించారు.

Tags: CI helps man who collapsed due to a seizure