August 20, 2026
Explore
డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి చేరిన నగదు

డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి చేరిన నగదు

August 20, 2026 | Andhra Pradesh

యువకుడి నిజాయితీని అభినందించిన సీఐ పి రమేష్

చిలకలూరిపేట ముచ్చట్లు:

పట్టణంలోని పురుషోత్తపట్నంకు చెందిన ఏలూరి నరేంద్ర గురువారం ఉదయం సుమారు 9.00 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా, జేబులో ఉన్న ₹29,000 నగదు ఆది ఆంధ్ర కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న బండారపు రాజీవ్ అనే యువకుడు ఆ నగదును గమనించి, ఏమాత్రం దురాశ పడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు.
విషయం తెలుసుకున్న సీఐ పి. రమేష్ బాధితుడు నరేంద్రను స్టేషన్‌కు పిలిపించి, రాజీవ్ చేతుల మీదుగానే ఆ ₹29,000 నగదును తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ చూపిన నిస్వార్థ నిజాయితీని సీఐ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. నగదు తిరిగి దక్కడంతో బాధితుడు నరేంద్ర పోలీసులకు, నగదు అప్పగించిన రాజీవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Cash returned to the person who lost it.