August 20, 2026
Explore
నేటితో ముగియనున్న శాసనసభ,మండలి వర్షాకాల సమావేశాలు

నేటితో ముగియనున్న శాసనసభ,మండలి వర్షాకాల సమావేశాలు

August 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నేటితో శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో సూపర్‌ సిక్స్ పథకాల అమలుపై చర్చించనున్నారు. కాగా అసెంబ్లీలో ఇప్పటికే పలు బిల్లులు ఆమోదం పొందాయి.

అసెంబ్లీలో నేటి ప్రశ్నోత్తరాలు
అసెంబ్లీలో ఇవాళ ప్రైవేట్ ఆస్పత్రుల్లో విద్యసేవల నిలుపుదలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇవ్వనున్నారు. అలాగే నిరుద్యోగభృతి, తిరుపతిలో గృహనిర్మాణాల క్రమబద్దీకరణ, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విద్యసేవల నిలుపుదలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానం చెప్పనున్నారు. నిరుద్యోగభృతి, తిరుపతిలో గృహనిర్మాణాల క్రమబద్దీకరణ, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇస్తారు.

శాసనమండలిలో నేటి ప్రశ్నోత్తరాలు
శాసనమండలిలో ఇవాళ పీఎం విద్యాలక్ష్మి పథకం, గోదావరి పుష్కరాలకు నిధులపై ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇవ్వనున్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు, విద్య హక్కు చట్టం, మహిళలకు ఆర్థికసాయం ప్రశ్నలకు మంత్రుల సమాధానం చెప్పనున్నారు.

Tags: Monsoon sessions of the Legislative Assembly and Legislative Council to conclude today.