అమరావతిముచ్చట్లు:
*మన ఇంట్లో పెరుగుతున్న పిల్లలు ఎలాంటి వారు, ఏం చేస్తున్నారో అనేది తల్లిదండ్రులు గమనిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి 😞
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి. లోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పాఠాలు చెప్పిన గురువునే, డబ్బుల కోసం ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చెడు వ్యసనాలు, గంజాయి సంస్కృతి ఎంతటి దారుణాలకు ఒడిగడుతుందో ఈ సంచలన ఘటన ప్రత్యక్ష సాక్షంగా నిలిచింది.
గంజాయి మత్తు, జల్సాల కోసమే..😕
పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు పాల్పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు గంజాయికి తీవ్రంగా అలవాటు పడ్డారు. విచ్చలవిడిగా జల్సాలు చేయడానికి డబ్బులు సరిపోకపోవడంతో, తమ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశారు.
ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి స్కూల్ ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఆమె ఇంటికి చేరుకోవడానికి ముందే నిందితులు గోడ దూకి లోపలికి చొరబడ్డారు. రూపారెడ్డి తాళం తీసి లోపలికి ప్రవేశించిన సమయంలో, నిందితులు వంటగదిలో దాక్కున్నారు. ఆమె ఫ్రెష్ అయి బెడ్రూమ్ లోకి వెళ్లగానే వెనక నుంచి అటాక్ చేసి, కత్తితో ఏకంగా 27 సార్లు దారుణంగా పొడిచి చంపేశారు.
నగదుతో పరారీ.. హైదరాబాద్ లో జల్సాలు
హత్య అనంతరం రూపారెడ్డి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులకు చిక్కకుండా, సీసీటీవీ కెమెరాలలో ఎక్కడా పడకుండా తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ డబ్బుతో హైదరాబాద్ చేరుకుని విచ్చలవిడిగా జల్సాలు చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను ఎట్టకేలకు గుర్తించి, ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు.
చదువు చెప్పి ప్రయోజకులను చేయాల్సిన గురువునే డబ్బుల కోసం దారుణంగా హత్య చేసిన ఈ ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని, తీవ్ర కలకలాన్ని రేపింది.
Tags: Where is the world heading?