August 13, 2026
Explore
డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రాయితీ: ఏపీ సర్కార్

డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రాయితీ: ఏపీ సర్కార్

August 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు రాయితీపై ఈ-ఆటోలను అందిస్తోంది. ఈ-ఆటోల విలువ రూ. 4.5 లక్షలు కాగా, ప్రభుత్వం రూ. లక్ష వరకు రాయితీ ఇస్తోంది. మిగిలిన మొత్తానికి తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ-ఆటోలను ప్రోత్సహిస్తున్నారు. ఆసక్తి గల డ్వాక్రా మహిళలు లేదా వారి కుటుంబసభ్యులు మెప్మా అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Tags: Rs 1 lakh subsidy for DWCRA women: AP Government