మదనపల్లె ముచ్చట్లు:
: పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ..
మదనపల్లె పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15న జరగనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్స్‌ను గురువారం ప్రత్యేక వాహనంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు, ఎక్సైజ్, హోంగార్డ్స్, ఎన్.సి.సి దళాలు మరియు స్కౌట్స్, గైడ్స్ కవాతును ఆయన పర్యవేక్షించారు.
పరేడ్‌లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, వేడుకలకు వచ్చే ప్రజలకు తగిన సౌకర్యాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, ఏఆర్ డీఎస్పీ డి. ఏడుకొండలరెడ్డి, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



Tags:Police parade ground getting decked up for the August 15 celebrations.