పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటిలోని ప్రజలకు నిరంతరం పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపి మున్సిపల్ వర్కర్స్యూనియన్ జిల్లా కార్యదర్శి దేవా, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకట్రమణారెడ్డిలు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవా మాట్లాడుతూ మున్సిపాలిటిలో పని చేస్తున్న డైలివేజ్ కార్మికులను అప్కాస్‌లో చేర్పి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న కార్మికులను నిర్లక్షం చేయరాదన్నారు. వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమాజ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారని , కార్మికులకు ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారికి ఇండ్లు కేటాయించి, ఇళ్లనిర్మాణానికి ప్రభుత్వం సహయం అందించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, కార్మికులకు మెరుగైన వేతనాలు, ఉద్యోగభద్రత , సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు తిరుమల, రామమూర్తి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
Tags: Municipal workers’ issues must be resolved.