August 5, 2026
Explore
స్క్రీన్‌పై చేయేరు నది పరిస్థితి చూపించిన గడికోట

స్క్రీన్‌పై చేయేరు నది పరిస్థితి చూపించిన గడికోట

August 5, 2026 | Andhra Pradesh

తాడేపల్లి ముచ్చట్లు:

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, చేయేరు నది నుంచి భారీ స్థాయిలో ఇసుక అక్రమంగా తరలించబడుతోందని ఆరోపించారు. కోటి మెట్రిక్ టన్నుల మేర ఇసుక దోపిడీ జరిగినా కడప జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నది పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని స్క్రీన్ ద్వారా ప్రజలకు చూపించారు. ఇసుకను పూర్తిగా తవ్వేయడంతో నదిలో రాళ్లు కూడా బయటపడే పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: Gadikota showed the condition of the Cheyyeru River on the screen.