లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య(72) బావిలో పడి మృతి చెందిన ఘటన విషాదం కలిగించింది. జులై నెల 31న కూలి పనులకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. దూర ప్రాంతానికి పనికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. ఆగస్టు 1న పెన్షన్ తీసుకోకపోవడంతో గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం గొల్లపల్లి సమీపంలోని బావిలో ఆయన మృతదేహాన్ని గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.
Tags: Elderly man dies after falling into a well in Lakkireddypalle.