రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి మండలంలోని కొత్తపల్లి పంచాయతీ బంగారువాండ్లపల్లి సమీపంలో మృతి చెందిన జింకను జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్ పిళ్లే మంగళవారం పరిశీలించారు. గ్రామ సమీపంలోని మామిడి తోటల్లో సంచరిస్తున్న జింకపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారుల సమాచారంతో చిన్నమండెం పశువైద్యాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం తదుపరి చర్యలు చేపట్టారు.
Tags: Deer dies in dog attack