August 1, 2026
Explore
చిట్లూరు హరిజనవాడలో రహదారి ఆక్రమణల తొలగింపు

చిట్లూరు హరిజనవాడలో రహదారి ఆక్రమణల తొలగింపు

August 1, 2026 | Andhra Pradesh

రామాపురం ముచ్చట్లు:

రామాపురం మండలం చిట్లూరు హరిజనవాడలో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను గ్రామ ప్రజల సమ్మతితో అధికారులు శనివారం తొలగించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ అధికారులు సామరస్యంగా సమస్యను పరిష్కరించి రహదారిని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వాహనాలు, పాదచారుల రాకపోకలు సులభతరమయ్యాయి. ఈ కార్యక్రమంలో MRO వెంకటేశ్వర్లు, SI శివకుమార్, ఆర్‌ఐ సమ్మద్ ఖాన్, సర్వేయర్, వీఆర్వోలు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

Tags: Removal of road encroachments in the Chitluru Harijanawada