పుంగనూరుముచ్చట్లు:
కార్మికులందరు తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు అందజాలవని లేబర్ ఆఫీసర్ ఎలిజబెత్ మార్గరేట్ తెలిపారు. శుక్రవారం ఆమె కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు లబ్ధి అందించేందుకు కార్మికులందరు లెబర్ కార్డులను రెన్యూవల్ చేసుకోవాలన్నారు. 9 వేల మంది సభ్యులు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉందన్నారు. అలాగే డిఎల్‌సి యాప్‌పై అవగాహన చేసుకోవాలన్నారు.
Tags: You need to link your Aadhaar.