పుంగనూరుముచ్చట్లు:
ప్రభుత్వం రిజిస్ట్రేషన్లశాఖను ప్రైవేటీకరణ చేస్తూ జారీ చేసిన 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంటు రైటర్లు నిరసన ర్యాలీని నిర్వహించారు. శుక్రవారం 11వ రోజు డాక్యుమెంటు రైటర్ల సంఘ ప్రతినిదుల రామమూర్తి, త్యాగరాజు లు కలసి ప్లకార్డులు పట్టుకుని కార్యాలయం నుంచి నాగపాళెం, ఇందిరాసర్కిల్, బస్టాండ్, పోలీస్‌స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సంఘ అధ్యక్షుడు రామమూర్తి మాట్లాడుతూ ప్రైవేటీకరణ జీవోపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ చర్యలతో లక్షలాది కుటుంభాలు వీధినపడుతుందని ఆరోపించారు. జీవోను రద్దు చేసేదాక ఉధ్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో పవన్‌కుమార్, బాబు, చంద్రశేఖర్, హరి, ఖలీల్, మునిరాజచారి, రవిచంద్రరాజు, జ్యోతి, కుమార్, కృష్ణవేణి, నాగరాజు, మురళి, రమణ, గణేష్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Document writers’ rally demanding the cancellation of GO 396.