పుంగనూరుముచ్చట్లు:
సీఏ చదువుతున్న రమ్యశ్రీకి రోటరీక్లబ్ వారు రూ.44 వేలు ఆర్థికసహాయాన్ని శుక్రవారం అందించారు. సంఘ ప్రతినిదులు డాక్టర్లు ప్రభాకర్, శరణ్, గణేష్, హరిప్రసాద్ , రాజారెడ్డిల ఆధ్వర్యంలో బాలిక తండ్రి వెంకట్రమణకు ఆర్థిక సహాయం అందించారు. సీఏ చదువుతున్న రమ్యశ్రీకి ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు అవసరమని డాక్టర్లు సూచించారు. సాధారణ రైతు కుటుంభానికి చెందిన వెంకట్రమణ దాతలను ఆర్థిక సహాయం కోరారు. ఈ విషయాన్ని తెలుగుముచ్చట్లువెబ్‌సైట్‌నందు గత నెల 18న పేద…ఆపై పెద్దబాధ అనే శీర్షికన ప్రత్యేక కథనం వెలువడింది. దీనిపై దాతలు స్పందించారు. దాతలకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిదులు శివశంకర్, ఎస్వీటి కిషోర్, అనిల్‌కుమార్, భాస్కర్, అయూబ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Tags: Assistance provided to an ailing CA student.