రాయచోటి ముచ్చట్లు:
రాయచోటిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం పార్టీ Sc సెల్‌కు నూతనంగా నియమితులైన నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం, సామాజిక సాధికారతకు వైఎస్సార్, వైఎస్ జగన్ ప్రభుత్వాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాయని అన్నారు. రాయచోటి నియోజకవర్గంలో పార్టీ sc సెల్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, దళితుల సమస్యల పరిష్కారానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నూతన నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, దళితుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tags:YSR and Jagan governments have accorded top priority to the welfare of the SC Cell: Gadikota