రాయచోటి ముచ్చట్లు:
రాయచోటిలో జీవో నెం. 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న శాంతియుత నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని రాయచోటి దస్తావేజు లేఖరుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు, రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం ప్రతినిధులు రాయచోటి సీఐ బి.వి. చలపతిని కోరారు.
ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో బస్టాండ్ నుంచి బంగ్లా సర్కిల్, కంసల వీధి మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవో నెం. 396ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తమ నిరసన కార్యక్రమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Tags: Document writers sought permission for a peaceful protest demanding the cancellation of GO No. 396.