July 27, 2026
Explore
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలి: జిల్లా కలెక్టర్

ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలి: జిల్లా కలెక్టర్

July 27, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించే మాసవారీ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును పరిశీలించారు.

ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎంలు, బీయూలు, సీయూలు, వీవీప్యాట్ యంత్రాలతో పాటు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోదాముల వద్ద పటిష్టమైన భద్రత కొనసాగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన వివిధ సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

Tags: Tight security must be in place at EVM warehouses: District Collector