మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజల నుంచి 83 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 52 భూవివాదాలు ఉండగా, ఆర్థిక, కుటుంబ వివాదాలు చెరో 7, మోసం 6, ఇతర సమస్యలు 5, న్యూసెన్స్ 4, FIR కు సంబంధించినవి 2 ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, సైబర్ నేరాలపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, విచారణలను వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని సూచించారు.
Tags: 83 complaints at the public grievance redressal forum; 52 are land disputes.