July 27, 2026
Explore
8 ఆటోలకు రూ.32 వేల జరిమానా

8 ఆటోలకు రూ.32 వేల జరిమానా

July 27, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో సోమవారం స్కూల్ విద్యార్థులను పరిమితికి మించి తరలిస్తున్న ఆటోలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేని వాటితో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థులను అధిక సంఖ్యలో తరలిస్తున్న 8 ఆటో లకు మొత్తం రూ.32 వేల జరిమానా విధించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఇకపై స్కూల్ పిల్లలను తరలించే ఆటోలపై రోజువారీ తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు.

Tags: Rs. 32,000 fine imposed on 8 autos.