July 27, 2026
Explore
జూలై 31లోపు త్రైమాసిక వాహన పన్ను చెల్లించండి..

జూలై 31లోపు త్రైమాసిక వాహన పన్ను చెల్లించండి..

July 27, 2026 | Andhra Pradesh

జరిమానాలు నివారించండి: జిల్లా రవాణా శాఖ అధికారి

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా పరిధిలోని అన్ని రవాణా వాహనాల యజమానులు 2026 సెప్టెంబర్ 30తో ముగిసే త్రైమాసిక వాహన పన్నును జూలై 31, 2026లోపు తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి డి. అశోక ప్రతాపరావు కోరారు. గడువులోపు పన్ను చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదని తెలిపారు.
వాహన యజమానులు ఇంటి నుంచే పరివాహన్ సేవా పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించవచ్చని సూచించారు.

గడువు దాటిన తర్వాత పన్ను చెల్లించకుండా వాహనం తనిఖీల్లో పట్టుబడితే పన్నుతో పాటు భారీ జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. ఆగస్టు నెలలో పట్టుబడితే పన్నుపై 100 శాతం, సెప్టెంబర్ నెలలో పట్టుబడితే 200 శాతం జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా జూలై 31లోపు పన్ను చెల్లించి అనవసరమైన జరిమానాలు, ఇబ్బందులను నివారించుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.

Tags: Pay the quarterly vehicle tax by July 31.