July 27, 2026
Explore
మదనపల్లె డీఎస్పీగా బుచ్చిరాజు బాధ్యతల స్వీకరణ

మదనపల్లె డీఎస్పీగా బుచ్చిరాజు బాధ్యతల స్వీకరణ

July 27, 2026 | Andhra Pradesh

శాంతిభద్రతలకు పెద్దపీట వేయాలని ఎస్పీ దిశానిర్దేశం.

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఎం.బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. వెయిటింగ్ లో ఉన్న ఆయనను ప్రభుత్వం ఇక్కడకు నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నూతన డీఎస్పీకి ఎస్పీ శుభాకాంక్షలు తెలుపుతూ.. విధి నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ప్రధానంగా మహిళల భద్రత, సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించి పారదర్శకంగా పని చేయాలని సూచించారు.

Tags: Buchiraju assumes charge as Madanapalle DSP.