పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని రహమత్‌నగర్‌లో నివాసం ఉన్న ఎస్.బావాజాన్ క్యాన్సర్‌వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్థానిక మైనార్టీ నాయకులు రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డికి తెలిపారు. దీనిపై స్పందించిన మిధున్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి బాధితుడికి రూ.3 లక్షలు విరాళంగా నిధులు మంజూరు చేయించారు. సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ కన్వీనర్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము , మైనార్టీల కార్యదర్శి మహబూబ్‌బాషా, కాపు సంఘ నాయకుడు కొండవీటి నరేష్, పట్టణ మైనార్టీ కార్యదర్శి అజీజ్ లు కలసి బాధితుడికి రూ.3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం ఎంపి మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags; Rs. 3 lakh for cancer patient