పుంగనూరుముచ్చట్లు:
జపాన్ దేశంలో సెఫ్టెంబర్ నెలలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు పుంగనూరు నుంచి కరాటే విద్యార్థులు ఎంపికైయ్యారని కరాటే మాస్టర్ మహేష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీలలో మైసూర్‌లో జరిగిన ఆల్‌ఇండియా షిటోర్యూ కరాటే ఛాంపియన్ పోటీల్లో పట్టణానికి చెందిన తాన్వేశ్వర్‌కుమార్‌రెడ్డి, శశాంత్, త్రివిక్రమ్ లు బంగారు పథకాలు సాధించారన్నారు. 20 సంవత్సరాలలోపు కటావిభాగంలో జుహాఫాతిమా బంగారు పథకము, శేష్ఠ్ర కాంస్యపథకము సాధించిందన్నారు. ఎం.రెడ్డిమహేష్ కుమితే విభాగంలో ఎంపికైయ్యారన్నారు. ఈ విజేతలు జపాన్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికైయ్యారని తెలిపారు. వీరిని కర్నాటక క్రీడలశాఖ మంత్రి అరుణ్‌మచ్చయ్య తదితరులు అభినందించారు.

Tags: Punganur students selected for karate competitions in Japan.