-ఆధారాలు సేకరించిన పోలీసులు
- మహారాష్ట్ర లారీ పై కేసు
పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు వద్ద గల ఎంబిటి రోడ్డు జాతీయ రహదారిపై ఈనెల 14న అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దేవేంద్ర(32) అనే ఎక్సెజ్ కానిస్టేబుల్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దీనిపై పలు అనుమానాలు, పుకార్లు వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ లు కలసి రెండు బృందాలుగా ప్రత్యేక టీములు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సీసీ పుటేజ్‌లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమయంలో రహదారిపై ఉన్న బ్యారీకేడ్లను మృతుడు ద్విచక్రవాహనంలో వెళ్తూ ఢీకొనడం, అదే సమయంలో మహారాష్ట్రకు చెందిన లారీ వేగంగా వచ్చి మృతుడిని ఢీకొట్టి వెళ్లిపోవడం జరిగినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన లారీని సీజ్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా దేవేంద్ర మరణానికి ఇతర కారణాలు ఏమి లేవని నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే డ్రైవర్ అరెస్ట్, వివరాలు వెల్లడించనున్నారు. కాగా గత పది రోజులుగా తీవ్ర సంచలనం కలిగించిన దేవేంద్ర మరణం రోడ్డు ప్రమాదమేనని నిర్ధారణ చేసి వెల్లడించేందుకు పోలీసులు సిద్ధమౌతున్నారు.
Tags: Excise Constable Devendra dies in a road accident.