పుంగనూరుముచ్చట్లు:
పట్టణం, మండలంలోని 137 పాఠశాలల్లోను శుక్రవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవోలు నటరాజరెడ్డి, రెడ్డెన్నశెట్టిలు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు పాఠశాలలను పటిష్టం చేసే కార్యక్రమంలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి , వారి సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులందరు తప్పక హాజరుకావాలెనని కోరారు.
Tags: Parents’ meeting on the 24th.