July 23, 2026
Explore
రాజీకి రాని ప్రభుత్వం – తగ్గేదే లేదంటున్న డాక్యుమెంట్‌ రైటర్లు

రాజీకి రాని ప్రభుత్వం – తగ్గేదే లేదంటున్న డాక్యుమెంట్‌ రైటర్లు

July 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లశాఖను ప్రైవేటీకరణ చేస్తూ 396 జీవో విడుదల చేయడంపై డాక్యుమెంట్‌ రైటర్ల ఆందోళన నాల్గవ రోజు గురువారం కొనసాగించారు. ప్రభుత్వం ఈ విషయంలో రాజీకి రాకపోవడంతో తగ్గేదే లేదంటు డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళనలు ఉధృతం చేశారు. సంఘ నాయకులు పూలత్యాగరాజు, బాబుస్వామి ఆధ్వర్యంలో పెన్‌డౌన్‌ చేసి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవోను రద్దు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. దస్తావేజులేఖర్లు , డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్‌ వెండార్లు కలసి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. త్యాగరాజు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ సేవలను ఆర్‌ఎస్‌కెలకు అప్పగిస్తే వేలాది మంది దస్తావేజులేఖర్లు ఉపాధి కోల్పోయి, వారి కుటుంబాలు వీధిన పడుతుందన్నారు. దస్తావేజులేఖర్ల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమాలు ఈనెల 31 వరకు కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి , జీవోను రద్దు చేయాలని లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్‌కుమార్‌, ఖలీల్‌, మునిరాజచారి, రవిచంద్రరాజు, జ్యోతి, చంద్రశేఖర్‌, హరి, కుమార్‌, కృష్ణవేణి, నాగరాజు, మురళి, రమణ, గణేష్‌, సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags; Government Refuses to Compromise; Document Writers Stand Firm