July 23, 2026
Explore
తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లో పడలేదా?.. అయితే ఇలా చేయండి!

తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లో పడలేదా?.. అయితే ఇలా చేయండి!

July 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తల్లికి వందనం’ పథకం డబ్బులు ఇంకా ఖాతాలో జమ కాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

నిధుల విడుదల ప్రక్రియను విడతల వారీగా చేపడుతూ జూలై 24లోగా అర్హులందరి ఖాతాల్లో జమ చేయనుంది.

ఒకవేళ అర్హత ఉన్నా డబ్బులు రాకపోతే, గ్రామ లేదా వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సంప్రదించి గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలి.

ఆధార్, విద్యార్థి వివరాలు సమర్పించి సమస్యను నమోదు చేస్తే అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారు.

గ్రామాల్లో నెల ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉండటం, రేషన్ కార్డు కలిగి ఉండటం వంటి అర్హతలు తప్పనిసరి.

Tags; Haven’t received the ‘Thalliki Vandanam’ funds in your account? Then do this!