July 23, 2026
Explore
‘భోగాపురం ఎయిర్పోర్టు’కు బెస్ట్ స్లోగన్ చేప్తే లక్ష బహుమతి: ప్రభుత్వం ఆఫర్

‘భోగాపురం ఎయిర్పోర్టు’కు బెస్ట్ స్లోగన్ చేప్తే లక్ష బహుమతి: ప్రభుత్వం ఆఫర్

July 23, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం వినూత్న పోటీ నిర్వహిస్తోంది. విమానాశ్రయ ప్రత్యేకత, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిబింబించేలా తెలుగులో ఆకట్టుకునే స్లోగన్ రూపొందించిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. స్లోగన్ను పేరు, చదువు, చిరునామా, మొబైల్ నంబర్తో కలిసి ఈ నెల 25 సాయంత్రం 5 గంటల లోపు airportslogan@gmail.com కు పంపాలి. లేదా 9440749687 వాట్సాప్ నంబర్ కు పంపాలి.

Tags: Government offers ₹1 lakh prize for the best slogan for ‘Bhogapuram Airport’.