పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని భీమగానిపల్లె గ్రామస్తులచే నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహాస్వామి , శ్రీవారాహి అమ్మవారు, దుర్గాదేవి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయ ఉభయదారులు పులిచెర్ల నాగరాజ, లక్ష్మీ దంపతులు, అక్కింనారాయణప్ప, పొన్నమ్మ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వేదపండితులు శ్ద్మా•క్తంగా గణపతిహ్గమము, స్వస్తివాచనము నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

Tags; The statue of Sri Lakshmi Narasimha Swamy is magnificently installed.