July 22, 2026
Explore
అక్రమ ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయాలి

అక్రమ ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయాలి

July 22, 2026 | Andhra Pradesh

.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: ఎమ్మెల్యే

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమ్మనాథరెడ్డి అక్రమ ఇసుక రవాణాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో విచక్షణారహితంగా ఇసుక తవ్వకాలు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags: Illegal sand transportation must be stopped immediately.