July 22, 2026
Explore
మై భారత్ ‘నేషన్ ఫస్ట్ ఛాలెంజ్’లో ప్రతిభ చాటిన వెంకట లోకేష్‌కు ఘన సన్మానం

మై భారత్ ‘నేషన్ ఫస్ట్ ఛాలెంజ్’లో ప్రతిభ చాటిన వెంకట లోకేష్‌కు ఘన సన్మానం

July 22, 2026 | Andhra Pradesh

వీరబల్లి ముచ్చట్లు:

వీరబల్లి ఎస్డీకేఆర్ డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థి వెంకట లోకేష్, కేంద్ర యువజన వ్యవహారాలు–క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ ‘నేషన్ ఫస్ట్ ఛాలెంజ్’లో జాతీయ స్థాయిలో ఐదో స్థానం, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో విఆర్డీఎస్ సురేంద్రారెడ్డి శాలువా, జ్ఞాపికతో లోకేష్‌ను ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో పది లక్షల మందికి పైగా పాల్గొన్న పోటీల్లో ఈ విజయం రాష్ట్రానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

Tags: Grand felicitation for Venkata Lokesh for excelling in the My Bharat ‘Nation First Challenge’