న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ బ్యారెల్ ను 90 డాలర్ల మార్కును దాటాయి. దీంతో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ఇంధన ధరలతో పాటు రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags; Crude oil prices rise again… Are petrol and diesel rates set to surge across the country?