అమరావతి ముచ్చట్లు:
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆగస్టు 1న ప్రధాని మోదీ రానున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.
పారిశుద్ధ్యం ఇతర ప్రజా అవసరాలను నలుగురు ఐఏఎస్ అధికారులు పర్యవేక్షిస్తారు.
మున్సిపల్ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యాన చంద్ర, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
వీరికి సహాయంగా 26 మంది నాన్ క్యాడర్ అధికారులను వివిధ కార్పొరేషన్ల నుంచి కేటాయించారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ కి వీరు రిపోర్ట్ చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags: Inauguration of Bhogapuram International Airport on August 1st.