July 21, 2026
Explore
ఈ రెండు ఊర్లు భద్రాచలంలో ఉన్నాయి ఈ ఊర్లు పై భలే జోకులు ఉంటాయి

ఈ రెండు ఊర్లు భద్రాచలంలో ఉన్నాయి ఈ ఊర్లు పై భలే జోకులు ఉంటాయి

July 21, 2026 | Andhra Pradesh

భద్రాచలం ముచ్చట్లు:

తంత, తన్నించుకుంట

ఈ ఊర్లు మధ్య ప్రయాణం,

ఎలావుంటుందో ఉహించుకుని నవ్వుకుందాం.

తంతానికి ఒక టికెట్ ఇవ్వండి.

తన్నించుకుంటానికి రెండు ఇవ్వండి.

సార్ చిల్లర ఇవ్వలేదు.
తంతానికి వెళ్ళేవాడికే ఇవ్వలేదు.నువ్వు తన్నిం చుకుంటానికి కదా!
చివరిదాకా వస్తావు కదా!
కంగారుపడకు.

వెనుకసీట్లో అయన : ఏరాబ్బాయి! ఈ మధ్య తంతానికి రావట్లేదు.

లేదు బాబాయ్! తన్నించు కుంటానికి వెళ్లిపోతున్నా బాబాయ్.
అక్కడ ఆర్డర్లు వస్తున్నాయి.

సరేరా! తన్నించు కుంటా అలవాటు అయిపోయి, తంత మాటే మరిచిపోయావు,

ఇంతలోడ్రైవర్ : తంతానికి ఎవరైనా వున్నారా?

కండక్టర్ : ఒక్కరే తంతానికి, అందరు తన్నించుకుంటానికే.
బాబూ తన్నించుకుంటానికి అందరు టికెట్లు చేత్తో పట్టుకోండి.

అప్పుడే మెలుకువ వచ్చిన పాసింజర్ : తంతానికి దిగాలి ఇప్పుడు ఎలా?

కండెక్టర్ విసుగ్గా : ఇంకో ఇరవై ఇచ్చి తన్నించు
కుంటానికి దిగు

బస్ దిగుతూ బాబాయ్ పిన్నిని తీసుకుని ఒకసారి తన్నించుకుంటానికి రండి.

Tags: These two villages are located in Bhadrachalam, and there are some great jokes about them.