పెద్దపల్లి ముచ్చట్లు:
ఆటోపై నుండి కిందపడి బాలుడు అక్కడికక్కడే మృతి! మల్దకల్ మండలం, పెద్దపల్లి సమీపంలో, పాల్వాయి గ్రామానికి చెందిన రంగముని అనే బాలుడు, మల్దకల్ పశువుల సంతకు వెళ్తున్న ఆటోపై ఎక్కి కూర్చున్నాడు,పెద్దపల్లి సమీపంలో ఆటో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, బాలుడు నియంత్రణ కోల్పోయి కిందపడ్డాడు. తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఘటన స్థలానికి చేరుకున్న మల్దకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags: Horrific Accident: