July 21, 2026
Explore
మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

July 21, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు కొడూరు పట్టణంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
  • మహిళలపై నేరాల నివారణ, సైబర్ నేరాలు, చట్టపరమైన రక్షణ, అత్యవసర సేవలపై అవగాహన కల్పించిన పోలీసులు.
  • కార్యక్రమంలో ఎంఆర్ఓ, వైద్యాధికారి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొని మహిళలకు అవగాహన.
  • మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు.
  • మహిళల సాధికారత, భద్రతకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి ఉందని స్పష్టం.
  • కొడూరు పట్టణంలో మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, మహిళల భద్రత, సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, నేడు కొడూరు పట్టణంలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కొడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారు,మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ), వైద్యాధికారి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొని మహిళలకు భద్రత, చట్టపరమైన హక్కులు, మహిళల రక్షణకు అమలులో ఉన్న చట్టాలు, సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండే విధానం, అత్యవసర పరిస్థితుల్లో డయల్–112 సేవలను వినియోగించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మహిళలు తమపై జరిగే వేధింపులు, గృహహింస, సైబర్ వేధింపులు లేదా ఇతర నేరాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు తెలియజేసి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు.

కొడూరు సీఐ గారు మాట్లాడుతూ, మహిళల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి మహిళ ధైర్యంగా, భయరహితంగా జీవించే వాతావరణం కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మహిళల భద్రత, సాధికారత కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

Tags:Awareness program on women’s safety