తిరుమల ముచ్చట్లు:
తిరుమలకు భక్తుల రాక పెరగడంతో అలిపిరి చెకోపోస్ట్ వద్ద మంగళవారం ఉదయం భారీగా వాహనాల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్లు, బస్సులు, వ్యాన్లు పెద్ద సంఖ్యలో చేరడంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చర్యలు చేపట్టి వాహనాలను క్రమబద్ధంగా కొండపైకి అనుమతించారు. భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
Tags: Vehicles flood Tirumala