పీలేరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన తొలి గ్రామపంచాయతీగా పీలేరు నిలిచిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పీలేరు గ్రామపంచాయతీ డెవలప్‌మెంట్ అధికారి రవీంద్రారెడ్డికి ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ పాలన, పారదర్శకత, నాణ్యమైన పౌర సేవలు అందిస్తున్న 23 గ్రామపంచాయతీలకు అంతర్జాతీయ ప్రమాణాల ఐఎస్ఓ గుర్తింపు లభించగా, అందులో పీలేరు కూడా చోటు దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమన్నారు. మెరుగైన పరిపాలన, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో తీసుకున్న చర్యల ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.
Tags: ISO recognition for Pileru Gram Panchayat